KMR: 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో 3, 5వ తరగతుల్లో ప్రవేశానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 14న ప్రవేశ పరీక్ష నిర్వహించి, ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారికి ఉచిత విద్య అందిస్తామన్నారు.