SRCL: గంభీరావుపేట మండలం రాజేశ్వర్రావు కాలనీలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ పిట్ల బాబు సందర్శించారు. గ్రామస్థులు అందరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పనుల వేళలో ఎండలు ముదురుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్య దర్శి భరత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు