SRD: రోడ్డు ప్రమాదంలో మరణించిన మనూరు ఏఎస్సై గోవింద్ నాయక్ కుటుంబాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరామర్శించారు. గోవింద్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్పీ, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి, అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని, శాఖా పరంగా అండగా ఉంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు.