E.G: స్వర్ణ పంచాయితీతోనే పారదర్శకమైన పాలన సాధ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం రాజవోలు గ్రామంలోని సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయితీ పనితీరుపై డీపీవో శాంతామణి, ఎంపీడీవో ఆర్మ్స్ంగ్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్లీ బర్డ్ స్కీం కింద ఐదుగురు గృహ యజమానులతో పన్ను కట్టించి రసీదులు ఇచ్చారు.