BPT: అద్దంకి-రేణింగవరం రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వచ్చిన లారీ, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు పేర్కొన్నారు. బైక్పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.