KKD: చేనేత కార్మికులకు జాతీయ స్థాయి మార్కెటింగ్ కల్పించేందుకు జిల్లాలో రూ.45 లక్షలతో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉప్పాడ, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు చేనేతపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ఆదరణ కల్పించాలన్నారు.