MNCL: మంచి సేవలతోనే సిబ్బందికి గుర్తింపు లభిస్తుందని జన్నారం మండలంలోని పోన్కల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ అన్నారు. జన్నారంలో 108 సిబ్బంది కిషన్, రఫిక్ ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవ పురస్కారాలు అందుకున్నారు. దీంతో వారిద్దరిని సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.