MNCL: బెల్లంపల్లి ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న కోల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, క్లీనర్ల నిరవధిక సమ్మె విరమించారు. గోలేటిలో డ్రైవర్లకు రూ.22 వేల వేతనం, క్లీనర్లకు రూ.11 వేల వేతనం చెల్లించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు AITUC రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ తెలిపారు.