MDCL: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా, కీసర ప్రాంతాల్లో గరిష్టంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దుండిగల్, దమ్మాయిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ఎండలో బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది.