HYD పరిసర జిల్లాలు విద్యకు ప్రధాన గమ్యస్థానాలుగా మారుతున్నాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరికి వలస వచ్చే వారిలో 54.5% మంది చదువుల కోసమే వస్తుండగా, గ్రేటర్ పరిధిలో ఈ శాతం 52గా నమోదైంది. మరోవైపు ఉపాధి అవకాశాల కోసం రంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా వలసలు కొనసాగుతున్నాయి. అయితే ఉద్యోగాల కోసం వచ్చిన యువతలో చాలామంది ఉపాధి కోసం కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది.