RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో విద్యుత్ స్తంభాల సమస్యలపై విద్యుత్ ఏఈకి కౌన్సిలర్ శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 14వ వార్డులో ఇళ్ల మధ్యలోని ఇనుప స్తంభాలు తీసి వాటి స్థానంలో కొత్తగా స్తంభాలను ఏర్పాటు చేయాలని, మోడల్ స్కూల్ చుట్టూ కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వైరింగ్ లైటింగ్ వేయాలని కోరారు.