MNCL: బెల్లంపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్ మెంట్ బృందం సోమవారం తనిఖీలు నిర్వహించింది. ఆసుపత్రులలో పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవలు, పరికరాల నిర్వహణ, రికార్డ్ మెయింటెనెన్స్ బృందం పరిశీలించింది. ఆసుపత్రి నిర్వహణపై తనిఖీ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సూపరింటెండెంట్ డా.రవి పేర్కొన్నారు.