KMM: ప్రభుత్వం ఆరోగ్య పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని PHC జిల్లా డిప్యూటీ DMHO డాక్టర్ వేణు మాధవరావు అన్నారు. ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వారు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ల్యాబ్, వ్యాక్సిన్ గదిని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. HPV టీకాల పంపిణీ తీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.