GDWL: మిట్టదొడ్డి పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించనున్నారు. LTI MIND TREE భవిష్య భారత్ సంస్థ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత టీకాలు, మందులు పంపిణీ చేయబడతాయి. రైతు సోదరులు ఆధార్ కార్డుతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.