MDK: రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత కీలకమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మెదక్ టౌన్‌లోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ‘Arrive Alive’ మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రతపై సూచనలు అందించారు. సీటుబెల్టు ఉపయోగించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, సూచనలు తప్పక పాటించాలని కోరారు.