TPT: నెల్లూరు రూరల్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. టీటీడీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని హుస్సేన్ అనే వ్యక్తి నమ్మించాడు. యువకుడి నుంచి రూ.4.1 లక్షలు తీసుకున్నాడు. అతనితో పాటు మరికొందరు విద్యార్థులకు కాల్ లెటర్లు ఇచ్చాడు. వాటిని తీసుకుని TTD ఆఫీసుకు వెళ్తే ఫేక్ కాల్ లెటర్లు అని తేల్చారు. దీంతో మోసపోయినట్లు గుర్తించాడు.