SDPT: సిద్దిపేట-హైదరాబాద్ రహదారిలో రిమ్మనగూడ గ్రామ శివారులో వేములవాడ డిపో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం ధ్వంసం కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేశారు.