ATP: యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన బాలుడు హేమచంద్రను హత్య చేసిన నిందితుడు సర్వేశ్ పోలీసులపై దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో బీరు సీసాతో తిరగబడడంతో, CI రామసుబ్బయ్య గాయపడ్డారు. ఈ క్రమంలో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపగా, అతడు కూడా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.