SS: పరారీలో ఉన్న నిందితులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆమడగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో నిందితుడైన మదనపల్లికి చెందిన సవరాల హరిని గురువారం వెంకటనారాయణపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడిపై శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని పలు స్టేషన్లలో అనేక కేసులు నమోదైనట్లు నల్లమాడ సీఐ శ్రీనివాసులు తెలిపారు.