పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని డీజీసీఏ అధిపతి ఫయాజ్ అహ్మద్ వెల్లడించారు. యుద్ధంతో పలు దేశాలు గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు. తద్వారా విమాన ఇంధనం ధరతో పాటు కార్యకలాపాల వ్యయాలు పెరిగాయని చెప్పారు. త్వరలో ఈ పరిస్థితులు మారి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.