అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులను ఆదేశించారు. వచ్చేనెల 12వ తేదీ వరకు జరిగే జాతరపై గురువారం ఆలయ ప్రాంగణంలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలన్నారు.