VZM: డెంకాడ ఎస్సై సన్యాసి నాయుడు గురువారం రాత్రి మండలంలోని నాతవలస గ్రామంలో ఎంపీపీ పాఠశాల వద్ద పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జరగకుండా అప్రమత్తత, సైబర్ నేరాలు, మన మిత్ర యాప్ వినియోగం తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు.