KMR: హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులకు ఎలాంటి అపోహలు వద్దని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావద్దని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని పీఆర్టీయూ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తోందన్నారు.