JN: దేవరుప్పుల మండలంలోని చిన్నమడూరు, పెద్దమడూరు, కడవెండి, మాదాపురం ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు.18 నుంచి 44 సంవత్సరాల లోపు మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని, ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.