SRCL: సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. కరోనా సమయంలో కీలక సేవలు అందించిన తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు.