WNP: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పాల్గల్ మండలానికి చెందిన ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం (E1) విద్యార్థిని బుధవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థుల సమాచారంతో అధికారులు ఆమెను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వ్యక్తిగత కారణాలే కారణమని సమాచారం.