JGL: మల్యాల గ్రామంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల ఫించన్లను మంజూరు చేయాలని సోమవారం 16వ వార్డు మెంబర్ గాండ్ల జ్యోతి జిల్లా కలెక్టర్‌ను ప్రజావాణి కార్యక్రమంలో కోరారు. 100 శాతం సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఫించన్ అందని బీసీ కాలనీకి చెందిన ఖాసీం బీ (23)ను తీసుకెళ్లి ప్రత్యక్షంగా దరఖాస్తు సమర్పించారు. అర్హులందరికీ త్వరితగతిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.