ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరా నగర్లో పేకాట స్తావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గోలి వెంకటేష్, గడ్డం లక్ష్మణ్, గుర్లే రవీందర్ పట్టుబడగా మరో ఆరుగురు పరారయినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో రూ. 12,040 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్కి తరలించినట్లు SI వెంకట కృష్ణ పేర్కొన్నారు.