ఆసిఫాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జిల్లా ఎస్పీ నితికా పంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. వినియోగదారులకు సిలిండర్లు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా అక్రమంగా సిలిండర్లను నిల్వ చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.