BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అభివృద్ధి పనుల కారణంగా ఈనెల 26న దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఈఓ దామోదర్ రావు తెలిపారు. దేవతామూర్తుల బాలాలయానికి తరలింపు కార్యక్రమం నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు సేవలు, దర్శనాలు ఉండవు. మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు దర్శనాలు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.