WGL: హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎమ్మెల్యే నాగరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు. వర్ధన్నపేటకు 100 కొత్త ఈవీ బస్సులు కేటాయించాలని, వరంగల్ మండలం పైడిపల్లిలోని సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో నూతన ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.