SDPT: చిన్నకోడూర్ పీఎస్ పరిధిలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకునేందుకు యత్నించిన నిందితుడు నెదునూరి అనిల్‌కు సిద్దిపేట కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జక్కాపూర్‌కు చెందిన దాసరి ఎల్లవ్వపై నిందితుడు దాడి చేయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.