VKB: కోట్పల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 27.5 కోట్ల నిధులు మంజూరైనట్లు మండల మాజీ వైస్ ఎంపీపీ వర్ధ మల్లికార్జున్ వెల్లడించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఈ పాత బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి వాహనదారులు, స్థానిక ప్రజలు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ నిధులు మంజూరు చేయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.