SRCL: రుద్రంగి మండలం పరిధిలోని బడితండా గ్రామంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గడ్డివాములు, కట్టెలు, చెట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.