సూర్యాపేట జిల్లాలో గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, పౌరసరఫరాల అధికారి కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ గ్యాస్ నిల్వలను రోజు పర్యవేక్షిస్తుంది. సిలిండర్ల బ్లాక్ మార్కెట్, దారిమళ్లింపులో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.