KNR: కరీంనగర్ నగరానికి మణిహారాలైన కేబుల్ బ్రిడ్జి అనుబంధ పనులు, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. అటు కరీంనగర్-వీణవకం రహదారి విస్తరణ, మరమ్మతులు, కల్వల ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు కూడా ఈ బడ్జెట్లోనైనా ప్రాధాన్యత దక్కుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.