MNCL: డ్రైనేజీలలో చెత్త వేస్తే నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు కౌన్సిలర్ బోడ రాజు అన్నారు. మంగళవారం వార్డులోని భగత్ సింగ్ కాలనీ పంచాయతీ వెనకాల మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. వార్డులోని డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.