మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్ద వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణ మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా పరిసరాలను శుభ్రం చేయించి, పవిత్రమైన నమాజ్ నిర్వహించడానికి అన్ని వసతులను సిద్ధం చేశారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.