VKB: అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎండాకాలం ప్రభావంతో వన్యప్రాణులకు ఆహార కొరత తీవ్రంగా మారింది. అడవిలో తిండి దొరకక కోతులు గుంపులు గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని అటవీ మార్గాల్లో వాహనదారులు, పర్యాటకుల వద్ద ఆహారం కోసం అవి ఎదురుచూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మూగజీవాల రక్షణకు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.