KNR: కరీంనగర్లో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో ఇన్స్పెక్టర్ సంజీవ్ పర్యవేక్షణలో బుధవారం తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 70 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, భారీ జరిమానాలు విధించారు. చలానాల నుంచి తప్పించుకోవడానికే కొందరు ప్లేట్లు తొలగిస్తున్నారని సీపీ పేర్కొన్నారు.