MBNR: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యార్థులను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె ఆకాంక్షించారు.