HYDలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆశ చూపి నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న డాటా ఎంట్రీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రూ.3,000 రిజిస్ట్రేషన్ ఫీజుతో వల వేసి, ఆపై అగ్రిమెంట్ నిబంధనల పేరిట బాధితులను భయపెట్టి లక్షలు వసూలు చేస్తున్నారు. నెలకు 1,500 మందిని టార్గెట్ చేస్తూ రూ.50 లక్షల వరకు అక్రమంగా అర్జిస్తున్నారు. లీగల్ నోటీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.