WGL: MGM ఆసుపత్రిలో రక్త నిల్వలు అట్టడుగుకు చేరడంతో అత్యవసర పరిస్థితి నెలకొంది. నిత్యం పెరుగుతున్న శస్త్రచికిత్సలకు రక్తం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్తదాన శిబిరాలు తగ్గిపోవడంకారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు అధిక ధరలకు రక్తం విక్రయిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.