MHBD: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని కేసముద్రం సీఐ సత్యనారాయణ అన్నారు. ఇనుగుర్తి మండలంలోని రాము తండా సర్పంచ్ భూక్యా మీటు నాయక్ తన సొంత ఖర్చుతో గ్రామంలో ఆరు సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రజా ప్రతినిధులు, దాతలు ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.