BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.23,99,920 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.2,07,450, బ్రేక్ దర్శనాలతో రూ.1,97,100, వ్రతాలతో రూ.1,10,000, VIP దర్శనాలతో రూ.2,70,000, కార్ పార్కింగ్ రూ.3,67,000, ప్రసాద విక్రయాలతో రూ.8,31,070, లీజులతో రూ.1,04,908 తదితర విభాగాల నుంచి ఈ ఆదాయం వచ్చింది.