SKLM: బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అన్నారు. శుక్రవారం జిల్లాలో హిరమండలం, పాతపట్నంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పర్యటించారు. ఈ మేరకు హిరమండలంలో అత్యాచారానికి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించి, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.