SRD: జిన్నారం మున్సిపాలిటీలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ముమ్మరంగా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా ప్రతినెల పంపిణీ చేసే బియ్యం ఈ నెల ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని మున్సిపల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.