కోనసీమ: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఫైర్ అయ్యారు. అల్లవరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లిలో వృద్ధ కళాకారుడుపై చేయి చేసుకోవడం దారుణం అన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన కళాకారుడుపై ప్రతాపం చూడడం మీ అధికార మదానికి నిదర్శనమని మండిపడ్డారు. దళితుల పట్ల స్పీకర్ వైఖరి అహంకారపూరితంగా ఉందన్నారు.