ASF: కాగజ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రహదారులపై అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతి శుక్రవారం సూచించారు. తెలంగాణ తల్లి చౌరస్తా-బట్టుపల్లి చౌరస్తా, రాజీవ్ చౌక్-అంబేద్కర్ చౌక్, రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు.