KNR: ”ఆపరేషన్ క్రాక్‌డౌన్”లో భాగంగా కరీంనగర్ పోలీసులు భారీ సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్నారు. అమాయకుల పేరుతో ‘మ్యూల్ ఖాతాలు’ సృష్టించి నేరగాళ్లకు విక్రయిస్తున్న ప్రధాన సూత్రధారి రాజేశ్వర్ రెడ్డితో సహా 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై పట్టణంలోని వన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ ముఠాను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు.